భగీరథను అరెస్ట్ చేయాలంటూ బిఆర్ఎస్ ఆందోళన
11-05-2026 04:25 PM
కరింనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు.
కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ ఆరోపించారు.






