బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఆందోళన
17-08-2026 07:16 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లిలో గులాబీ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకాన్ని నిలిపి వేతకు పూనుకుందని, ఈ పథకం యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని కాంటా చౌరస్తాలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






