ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
బాన్సువాడ, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ ఓడ్ల మహేందర్ తమ్ముడు ఓడ్ల కృష్ణ ఆకస్మికంగా మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్త్చ్రర్మన్ షేక్ జుబేర్ మైలారం గ్రామానికి చేరుకుని కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు గోడిసెల నర్సింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, లక్ష్మణ్, పెర్కకృష్ణ, శ్రీనివాస్, మోషిన్, అక్తర్, భూమయ్య, పోశెట్టి, భాస్కర్, డి.సాయిలు, బాబు, భీమ్రావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






