అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాలు వారోత్సవాలు
కోదాడ,(విజయ క్రాంతి): రేడ్లకుంట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 'తల్లి పాలు వారోత్సవాలు' సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతలు, గర్భిణులకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు మాట్లాడుతూ... "నవజాత శిశువులకు తల్లి పాలే శ్రీరామరక్ష.
పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే అందించడం ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, మంచి రోగనిరోధక శక్తి లభిస్తాయి అన్నారు. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లి పాలు అమృతం లాంటివి" అని తెలియజేశారు. అనంతరం బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని (గుడ్లు, బలామృతం) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు తో పాటు పంచాయతీ కొల్లు నాగలక్ష్మి, ఏఎన్‌ఎం గోపమ్మ, అంగన్‌వాడీ టీచర్ పద్మ, అలాగే గ్రామ బాలింతలు, గర్భిణులు, అంగన్‌వాడీ ఆయాలు గ్రామస్తులు పాల్గొన్నారు






