4 April, 2026 | 5:52 PM

ఇత్తడి దొంగలు గ్రామంలో హల్ చల్

04-04-2026 04:17 PM

ఒక సంవత్సరంలోనే 30 ఇళ్లల్లో పైగా చోరి. నేటి వరకు దొరకని దొంగలు.

దొంగలను పట్టుకోవడంలో అయోమయంలో పోలీసులు

తాళం వేసి ఇల్లు ఉంటే.. ఇత్తడి, రాగి ,ఫ్యాన్లు మాయం

తుంగతుర్తి,(విజయక్రాంతి): గత కొంతకాలంగా ఇళ్లల్లో తాళం వేసి ఉంటే , ఇళ్లలోని ఇత్తడి, రాగి ,ఫ్యాన్లు మాయమవుతున్నాడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటన అన్నారంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గత సంవత్సరం నుండి నేటి వరకు సుమారుగా 30 ఇండ్లలో ఎవరు లేని సమయం చూసి, అప్పటికప్పుడే ఇత్తడి, రాగి వస్తువులు, ఆరు బయట గల, సీలింగ్ ఫ్యాన్లు సైతం మాయమవుతున్నాయి.

దీనితో ప్రతి ఒక్కరూ వేల రూపాయలు నష్టపోతున్నారు. గతంలో కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటి వరకు కూడా, దొంగతనాలు చేసే వారు దొరకకపోవడం, గ్రామంలోని ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఒక్కొక్కరి ఇండ్లలో ఇత్తడి కంచాలు, ఇత్తడి బకెట్లు, పాత గంగాళాలు చొప్పున రెండు క్వింటాలు మూడు క్వింటాల ఇత్తడి, మరికొందరి ఇళ్లల్లో ఫ్యాన్లు కూలర్లు సైతం అపహరణకు గురైనట్లు వాపోతున్నారు. ప్రస్తుతం కిలో ఇత్తడి వెయ్యికి పైగా ధర పలుకుతున్నాడంతో ఒక దొంగతనం చేస్తే 40 నుంచి 50 వేలు నష్టపోతున్నారు.

సాయంత్రం తాళం వేసి బంధువుల ఇంటికి గాని, పెళ్లిలో గాని వెళ్లి వస్తే, దొంగలు పడి, వస్తువులు ఎత్తుకు వెళుతున్నట్లు భయంతో గ్రామస్తులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గ్రామములో నే కొంతమంది గ్రూపుగా చేరి, హైదరాబాదు విజయవాడ వంటి నగరాల లోని వ్యాపారస్తులతో కుమ్మక్కై రాత్రికి రాత్రి దొంగలించిన సరుకులను ఆటోల ద్వారా, తరలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జరుగుతున్న సంఘటన పట్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేకంగా గ్రామంలో నిఘా పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని, దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.