ఆర్ట్స్ కళాశాలలో ప్రజా పాలనలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం
04-04-2026 04:14 PM
హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రాంగణం శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ చందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




