నవ సమాజ నిర్మాణమే బిజెపి ధ్యేయం
- కామారెడ్డి జిల్లా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ ఇన్చార్జి విక్రం రెడ్డి
తాడ్వాయి,(విజయక్రాంతి): నవ సమాజ నిర్మాణమే బిజెపి ధ్యేయమని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమము జిల్లా అధ్యక్షులు విక్రం రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో ఈ కార్యక్రమం పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత దేశంలో, రాష్ట్రంలో బిజెపి ప్రత్యేక మహోన్నత కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
నవ సమాజ స్థాపన, సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా మార్చడం కోసం బిజెపి ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. వ్యక్తి నిర్మాణాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకు వెళ్లడమే బిజెపి లక్ష్యం అన్నారు. జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ... దేశంలో నరేంద్ర మోడీ పాలన ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతుందని తెలిపారు. నరేంద్ర మోడీ అంటేనే ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు.




