మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో సరికొత్త కోర్సులు
ఇరోస్ ఏఐ విద్య భాగస్వామ్యంతో ఫ్యూచర్-రెడీ ప్రోగ్రామ్స్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాలలో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ ఇరోస్ ఏఐ విద్యతో కలిసి క్రియేటివ్ మీడియా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ వంటి రంగాల్లో సరికొత్త ఇండస్ట్రీ- ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించింది. నేటి గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక ఏఐ టూల్స్, టెక్నాలజీని సృజనాత్మకతతో జోడించి ఈ ప్రోగ్రా మ్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి విశ్వ విద్యాలయం చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ ‘చదువుకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నిపుణుల పర్యవేక్షణలో రియల్-టైమ్ ప్రాజెక్టులు, అడ్వాన్స్‌డ్ స్టూడియోల్లో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.‘ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పెను మార్పు లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన తర్వాత సినిమా మేకింగ్, యానిమేషన్, డిజిటల్ స్టోరీ టెల్లిం గ్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి.
ఇప్పుడున్న కంపెనీలన్నీ కేవలం డిగ్రీ ఉన్న వారి కోసం కాకుండా, టెక్నాలజీపై పట్టు ఉండి కొత్తగా ఆలోచించే నిపుణుల కోసం వెతుకుతున్నాయి.అందుకే మేము ఇరోస్ ఏఐ విద్యతో కలిసి ఈ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించాం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మా విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే కాకుం డా, ఏఐ టూల్స్ ఎలా వాడాలి, గ్లోబల్ మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనే అంశాలపై పూర్తిస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. విద్యార్థులు తమ కెరీర్‌లో గొప్ప ఎత్తుకు ఎదగడానికి, భారతదేశం గర్వించదగ్గ క్రియేటర్లుగా మారడానికి ఈ కోర్సులు ఒక బల మైన పునాదిగా నిలుస్తాయని నేను నమ్ముతున్నాను’.
ఛాన్సలర్ డాక్టర్ సుధారమణ మాట్లాడుతూ ‘సాంకేతికతను సాధారణ విద్యలో భాగం చేస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను, వ్యాపార దృక్పథాన్ని పెంపొందిం చడానికి ఇది ఒక గొప్ప వేదిక’. వైన్ ఛాన్సలర్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ ప్రమాణా లకు అనుగుణంగా ఈ సిలబస్‌ను రూపొందించాం. విద్యార్థులకు ఆధునిక ప్రొడక్షన్ విధానాలు, ఏఐ టూల్స్‌పై పూర్తి అవగాహన కల్పిస్తాం’. ఇరోస్ ఏఐ విద్య సీఈవో మాట్లాడుతూ ఊహలకు సాంకేతికతను తోడు చేయగలిగే వారికే భవిష్యత్తు ఉంటుంది. ప్రకటనలు, గేమింగ్, కమ్యూనికేషన్ కోర్సులు నేర్చుకున్న వారికి లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి.






