28 March, 2026 | 5:09 AM

సిగల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన బ్రాండ్ ఆక్స్

28-03-2026 01:57 AM

భారత్‌లో న్యూరో మార్కెటింగ్‌కు కొత్త దిశ

ఏఐ, న్యూరోసైన్స్ సమ్మిళితంతో మార్కెటింగ్‌లో గుర్తింపు, నమ్మకం, కన్వర్షన్లకు కొత్త మార్గం

హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): భారత్‌లో తొలి న్యూరోమార్కెటింగ్ ఆధారిత 360ఓ బ్రాండ్ గ్రోత్ ఏజెన్సీ బ్రాండ్ ఆక్స్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ తన స్వంత సిగ్నల్ ఫ్రేమ్‌వర్క్‌ను హైదరాబాద్‌లోని మా దాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. బ్రాండ్‌ను కనిపించకుండా ఉండ నివ్వదు, ప్రేమించకుండా ఉండనివ్వదు అనే లక్ష్యంతో రూపొందించిన ఈ ఆరు దశల న్యూరో మార్కెటింగ్ వ్యవస్థ, ఏఐ ఆధారిత, న్యూరోసైన్స్ మద్దతుతో మార్కెటింగ్ రం గంలో కొత్త దిశను సూచిస్తోంది.

ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సంస్థ ఫౌండర్, సీఈవో సాగర్ దత్తా, వందనా దత్తా, సంస్థ సభ్యులు ప్రణీత్, అనుష్మన్, ఇతర బ్రాండ్ ఆక్స్ సిబ్బంది ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఫౌండర్ అండ్ సీఈఓ సాగర్ దత్తా మాట్లాడుతూ, సమాచా రం అధికంగా ఉన్న ఈ ప్రపంచంలో బ్రాం డ్లు కనిపించకపోవడం వల్ల కాదు, అనుబంధం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడు తున్నాయి.

సిగ్నల్ ఫ్రేమ్‌వర్క్ ఈ లోటు ను భర్తీ చేస్తుంది. ఇది మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఎలా భావిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారో దానికి అనుగుణం గా మార్కెటింగ్‌ను రూపొందించి, గందరగోళంలోనూ స్పష్టమైన సంకేతంగా బ్రాండ్లను నిలబెడుతుంది అని తెలిపారు. నైతికత, పారదర్శకత కు ప్రాధాన్యతనిస్తూ బ్రాండ్ ఆక్స్, మార్కెటింగ్‌ను కేవలం ప్రచారం కాకుండా ప్రభా వాన్ని సృష్టించే శాస్త్రంగా మలచాలని లక్ష్యం గా పెట్టుకుంది.మానసిక శాస్త్రం, వ్యూహం, అమలు సమ్మేళనంతో సంస్థలు గుర్తిం పు పొందే, నమ్మకం కలిగించే, ప్రభావవంతమై న బ్రాండ్లుగా ఎదగడానికి కట్టుబడి ఉంది.