13 July, 2026 | 4:27 AM

గంటల కొమ్మలు

13-07-2026 02:31 AM

స్విస్ కొండ సానువులపై 

ఆ చెట్ల కొమ్మలు చిరు గంటలై

మోగుతూ ప్రేమతో పిలుస్తున్నాయి !

పియర్స్ చెట్లు పింక్ వర్ణ లిప్ స్టిక్ 

అద్దుకుని హొయలు పోతున్నాయి !

గాలి అలలకు ఆ గంటలు టంగ్ టంగ్ మని 

మధుర నాదాలు పలుకుతున్నాయి..

కొండల్లో ఆ సవ్వడి శ్రావ్యంగా, 

రస రమ్యంగా ఉంది !

ఎర్రని ఆపిల్ చెట్లు

తన వైపు రమ్మని పిలుస్తున్నాయ్

కోమలి చేతివేళ్ల స్పర్శ కోసం

పండ్లు రాల్చేందుకు 

సిద్ధమని సైగ చేస్తున్నాయి

కొండలెక్కి అలిసిన మేనికి 

ఆ అనుభవాలన్నీ ఉపశమన సంగీతాలు

జీవిత కాలానికి తీయని 

జ్ఞాపకాల సందడి !!


-