మోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దాం
రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపు
ముషీరాబాద్,మే7 (విజయక్రాంతి): ఈ నెల10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి బీజేపీ బహిరంగ సభలో పాల్గొనున్న మన దేశ ప్రధాని ‘ నరేంద్ర మోడికి‘ ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తూ గురువారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్ ఆధ్వర్యంలోఆర్టిసి క్రాస్ రోడ్స్ సమీపంలోని జవహర్‌స్కూల్,
అశోక్‌నగర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్ కార్యక్రమానికి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, శ్రీనివాస్ ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, శేషి కాంత్ తదితరులు పాల్గొన్నారు.






