24 June, 2026 | 3:23 PM

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ

24-06-2026 02:09 PM
  1. తుంగభద్రపై కర్నాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదు?
  2. తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా?
  3.  తుంగభద్రపై కర్నాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి 
  4. రాష్ట్రానికి రేవంత్ ద్రోహం చేస్తున్నారు

హైదరాబాద్: జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్ట్, ఆర్డీఎస్, ఇతర అంతర్రాష్ట్ర సాగునీటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సాయంత్రం 5 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. తుంగభద్రపై( Tungabhadra waters) కర్నాటక నిర్మిస్తున్న జలాశాయాలు, ఎత్తిపోతల పథకాలు, ఆర్డీఎస్ సమాంతరంగా ఏపీ చేపడుతున్న కాలువ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) లేఖ రాశారు.  తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ జల హక్కులను(Telangana water rights) బేరసారాల అంశంగా మార్చారా?, తుంగభద్రపై కర్నాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదు?అని ప్రశ్నించారు. కర్నాటక ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ నీటి వాటా తగ్గుతుందని చెప్పారు. కర్నాటక ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కర్నాటక అక్రమ నిర్మాణాలకు(Karnataka illegal constructions) పరోక్షంగా సహకరించడం ద్రోహం కాదా? అన్నారు. తుంగభద్రపై కర్నాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, జలశక్తి మంత్రిత్వ శాఖకు అభ్యంతరాలు తెలపాలన్నారు. అవసరమైతే కర్నాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో(Supreme Court of India) కేసు వేయాలని తెలిపారు. తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని నిరూపించాలన్నారు. పాలమూరు జల హక్కుల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని హరీశ్ రావు తెలిపారు.