26 February, 2026 | 2:31 AM

దివ్యాంగులకు ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ చేయూత

25-02-2026 12:00 AM

70 మందికి ఎలక్ట్రానిక్ కృత్రిమ చేతులను పంపిణీ చేసిన కంపెనీ

సికింద్రాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): వ్యవసాయ రంగంలో ప్రముఖ సంస్థ ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా, ఇనాలి ఫౌండేషన్ భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన 70 మంది దివ్యాంగులకు అధిక నాణ్యత గల బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ కృత్రిమ చేతులను విజయవంతంగా పంపిణీ చేసింది.

ఈ పంపిణీ శిబిరం సికిందరాబాద్ ఎస్‌డీ రోడ్డులోని మహబూబ్ కాలేజీలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయం త్రం 5 గంటల వరకు నిర్వహించారు. శిబిరం లో ఇనాలి ఫౌండేషన్ నిపుణుల బృందం ప్రతి లబ్ధిదారుని అవసరాలకు అనుగుణంగా కొలతలు తీసుకొని కృత్రిమ చేతులను అమర్చారు.ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం చేతులు కోల్పోయిన వారికి ఆత్మవిశ్వాసం, గౌరవం, స్వతంత్ర జీవనాన్ని పునరుద్ధరించడం.

ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ఎల క్ట్రానిక్ కృత్రిమ చేతులు లబ్ధిదారుల దైనందిన జీవనంలో కీలక మార్పును తీసుకురానున్నా యి. ఈ సందర్భంగా ఏరీస్ అగ్రో లిమిటెడ్ సీఎండీ రాహుల్ మిర్‌చందాని మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం మా సంస్థ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామన్నారు. దివ్యాంగులకు స్వయం సాధికారత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలని మా సంకల్పం అన్నారు.

ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జయ ప్రదీప్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల జీవితా ల్లో ఆశా కిరణం వెలిగించగలిగినందుకు మేము గర్విస్తున్నాం. ఈ అవకాశాన్ని అంద రూ సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాం. సమాజానికి తిరిగి ఇవ్వడం మా సంస్థ సంస్కృతిలో అంతర్భాగం, అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ వ్యవసాయ సేవలతో పాటు సామాజిక అభివృద్ధి పట్ల తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా చాటింది.