కట్ట మైసమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు
11-08-2026 12:51 AM
సురంగల్లో ఘనంగా వేడుకలు
మొయినాబాద్ ఆగస్టు 10(విజయ క్రాం తి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని సురంగల్లో కట్ట మైసమ్మ బోనాల వేడుకలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ వస్త్రధారణ లో బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. డప్పుల మోత, మేళతాళాల మధ్య బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. మహిళ లు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పా ల్గొని వేడుకలను విజయవంతం చేశారు. గ్రా మ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించా రు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






