ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్‌గా బోనాల సైదారావు
కోదాడ, మార్చి 22 : సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణానికి చెందిన బోనాల సైదారావు మోటివేషనల్ స్పీకర్ గా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. శని & ఆదివారాల్లో నల్గొండ లోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో నేషనల్ హెడ్ బోర్డ్ మెంబర్ నూనె సుదర్శన్ చేతుల మీదుగా మోటివేషనల్ స్పీకర్ గా సర్టిఫికెట్ పొందడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రీజియన్ 2 ప్రెసిడెంట్ కోట్ల సాయికిరణ్, కోటా సరిత నారాయణ కవిత, గూడూరు అంజిరెడ్డి, హర్షిత, శ్రీలత, రవీంద్ర చారి, బాలు, సరిత మొదలగు ట్రైనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల సైదారావు మాట్లాడుతూ విద్యార్థులు, యువతకి ప్రేరణ కలిగించి వారి లక్ష్యాలు సాధించే విధంగా జ్ఞాన నైపుణ్యాలు అందించడం, సమాజ సేవతో దేశాభివృద్ధిలో పాల్గొనడం తన కర్తవ్యం అని తెలియజేశారు.ఈ సందర్భంగా శిక్షణ పొందిన 30 ట్రైనర్లు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




