19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు

09-12-2025 08:29 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు 

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు(Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి. శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ ఈ మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే పేల్చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. బాంబు పేలొద్దంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ హెచ్చరించారు. మెయిల్ పంపిన వ్యక్తి అమెరికాకు చెందిన జాస్పర్ పక్టార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తం విమానంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు తక్షణమే అప్రమత్తమై తనిఖీలు చేశారు.