మరోసారి ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్‌గా బోడ స్వామి
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణానికి చెందిన బోడ స్వామిని మరోసారి నల్గొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్‌గా నియమించి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ఆయన శుక్రవారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బోడ స్వామి మాట్లాడుతూ.. తనకు మరోసారి అవకాశం కల్పించిన మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో కష్టపడి పనిచేస్తానని, అధిష్టానం పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తానని ప్రమాణ సాక్షిగా మాట ఇస్తున్నానని వెల్లడించారు.
అలాగే పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ, వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతానని చెప్పారు. తనకు సహకరించిన నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా సోదర సమానులైన నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు, ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్యకిరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.






