డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై బీఎల్‌ఓలకు అవగాహన
ఆదిభట్ల, ఆగస్టు 18 (విజయ క్రాంతి): డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణరెడ్డి సూచిం చారు. ఆదిభట్ల సర్కిల్ రాగన్నగూడ కార్యాల యంలో బీఎల్‌ఓలు, సూపర్వైజర్లు, కోఆర్డి నేటర్లకు అవగాహన సమావేశం నిర్వహిం చారు. సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాలు, నోటీసులు, హియరింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించామని, అక్టోబర్ 1, 2026ను అర్హత తేదీగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. పేరు చేర్పు, తొలగింపు, వివరాల సవరణకు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంత రాలను సెప్టెంబర్ 16లోపు సమర్పిం చాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం6, తొలగింపునకు ఫారం7, వివరాల సవరణకు ఫారం8 వినియోగించుకోవచ్చని వివరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామలీస్ కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని తెలిపారు. సంబం ధిత ఓటర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అంద జేసి హియరింగ్ వివరాలను తెలియజేయా లని బీఎల్‌ఓలకు సూచించారు. నోటీసులు, హియరింగ్ వివరాలు, ఫొటోలను బీఎల్‌ఓ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.






