13 March, 2026 | 7:56 AM

రక్తదానం ప్రాణాలను కాపాడే కార్యక్రమం

13-03-2026 01:25 AM

ఘట్ కేసర్, మార్చి 12 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ సెల్  యూనిట్ 7 ద్వారా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జూబ్లీ హిల్స్ వైటల్ సహకారంతో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరానికి విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకుల నుండి మంచి స్పందన లభించింది.

50 మందికి పైగా ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి తమ సేవను అందించారు. ఈకార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ నారాయణ రెడ్డి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ డీన్ రఫత్ రజియా, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ ఉషారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని పేర్కొంటూ, విద్యార్థులు స్వచ్ఛంద సేవకులు చూపిన ఉత్సాహాన్ని అభినందించారు.

ఈకార్యక్రమం డాక్టర్ సి. మల్లేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్‌ఎస్‌ఎస్ సెల్, డాక్టర్ పి. దివాకర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్  ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 7 ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వ్యవసాయ మరియు నర్సింగ్ విభాగాల ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డా. శ్రీధర్ బెస్సే మరియు శ్రీమతి కమల కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఫ్లైయింగ్ ఆఫీసర్ సౌరభ్ బి., NCC ఆఫీసర్ కూడా విద్యార్థులను సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు.