13 March, 2026 | 5:44 AM

భూ కబ్జాలను పరిశీలించిన నాయకులు

13-03-2026 01:26 AM

అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 12: అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి అనాజ్ పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో జీనియస్ సంస్థ భూకబ్జాలను సీపీఎం నాయకులు పరిశీలించారు. వేముల కత్వ, ఇందిరా సాగర్  ఎఫ్టీఎల్ ను ఆక్రమించి రోడ్డు నిర్మిస్తుండగా సీపీ ఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా  సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ... జీనియస్ సంస్థ వందల ఎకరాలలో వెంచర్ నిర్మాణ పనులు చేస్తుందన్నారు.

ఇందిరా సాగర్, వేములకత్వ ఎఫ్టీఎల్ పరిధిని పరిశీలించగా అక్కడ భారీగా రోడ్లు నిర్మిస్తున్నారని అన్నారు. సంస్థ ప్రతినిధులను అడగగా ఇరిగేషన్ అనుమతులతోనే  రోడ్డు నిర్మిస్తున్నట్టు బదులిచ్చినట్టు తెలిపారు. రోడ్డు మా కోసం కాదు.. రైతుల కోసం నిర్మిస్తున్నామని  చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో వెంచరు నిర్మించే క్రమంలో మట్టి, బండరాలతో  ఎఫ్ టి ఎల్ ప్రాంతంలో నిండి ఉండగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు  చేస్తే తప్ప... ఆ మట్టి, బండరాళ్ళను  తొలగించినట్లు తెలిపారు.

దాదాపుగా 300 ఎకరాలలో చేస్తున్న ఈ జీనియస్ విల్లాస్ కి ఎటువంటి పర్మిషన్ లు లేవన్నారు. నాల పర్మిషన్, హెచ్‌ఎండీఏ పర్మిషన్ గాని లేకుండా అగ్రికల్చర్ పేరుతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. కావున వెంటనే అధికారులు స్పందించి ఆ చెరువులో జరుగుతున్న పనులను నిలుపుదల చేసి ఇరిగేషన్ వాళ్లు ఇచ్చిన పర్మిషన్లు కూడా రద్దుచేసి చెరువులను రక్షించి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలన్నారు.

వెంటనే అధికారులు సందర్శించి పనులు నిలుపుదల చేయాలని సీపీఎం పార్టీగా రిమాండ్ చేస్తున్నామని.. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో  మాజీ ఉపసర్పంచ్ వరకాల బాలరాజ్, ముత్యాలు, మహేష్,కావలి జంగయ్య, మండల నాయకులు జి. శివకుమార్ సత్యనారాయణ శ్రీను మాలాద్రి చిర్ర శివ, తాటి పెళ్లి యాదయ్య,ప్రభాకర్, శ్రీకాంత్ ప్రవీణ్, పాల్గొన్నారు.