10 May, 2026 | 12:37 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

విశ్వ విశ్వానిలో రక్తదాన శిబిరం

26-02-2026 01:45 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): విశ్వ విశ్వాని కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని 59 యూనిట్ల రక్తాన్ని జనని వాలంటరీ బ్లడ్ సెంటర్‌కు అందజేశారు.

బ్లడ్ సెంటర్ ఫౌండర్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. విశ్వ విశ్వాని విద్యార్థులు చదువుల్లో రానిస్తూ సమాజ సేవలో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. రక్త దాతలకు వాటర్ బాటిల్, రూ.లక్ష ప్రమాద బీమాను అందజేశారు. కార్యక్రమంలో విశ్వ విశ్వాని కళాశాల ప్రెసిడెంట్ జీఎస్‌ఎస్ వెంకటేశ్వర్ రావు, కళాశాల ప్రధానోపాధ్యాయులు డా. ఎం మదనమోహన్, డా.ఎస్ శ్రీకాంత్, డైరెక్టర్లు డా. చక్రవర్తి, ప్రొ. మీర్ ఇర్ఫాన్ ఉల్ హా క్, వైస్ ప్రిన్సిపాల్ డా. డి రాఘవ, హెచ్‌వోడీ డా. ఏపీ గాయత్రి, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు పి శ్రీకాంత్ గౌడ్, శివ కుమార్ పాల్గొన్నారు.