18 July, 2026 | 2:11 AM

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు

18-07-2026 01:58 AM

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ 

రామారెడ్డి, జూలై 17 (విజయక్రాం తి):రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రా మానికి చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు కుమ్మరి శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి ని యోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ప్రజా సంక్షేమం, గ్రామాభివృ ద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం చేస్తున్న కృషికి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొగుళ్ల అరవింద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు