6 August, 2026 | 2:30 AM

ఫీజుల బకాయిలపై బీజేపీ లాడాయి

06-08-2026 12:20 AM

బీజేవైఎం ఆధ్వర్యంలో  విద్యార్థుల సంతకాల సేకరణ

గజ్వేల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఫీజుల బకాయి  బీజేపీ లాడాయి‘ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని బీఎంఆర్ డిగ్రీ కళాశాల, విశ్వతేజ, ప్రగతి జూనియర్ కళాశాలల్లో బుధవారం సంతకాల సేకరణ, మిస్డ్ కాల్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేసి, మిస్డ్ కాల్ ద్వారా తమ మద్దతు తెలిపారు.

విద్యార్థుల ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, మనోహరాబాద్ మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్, బీజేవైఎం జిల్లా నాయకులు సదానంద్ గౌడ్, రెడ్డెమైన లింగం, ఆర్కే యాదవ్, బబ్బురి రవీందర్ గౌడ్, కుకూనూరుపల్లి మండల అధ్యక్షుడు నాయిని సందీప్ కుమార్, బార్ అరవింద్, బోనాల రాజు, బీజేవైఎం నాయకులు మంద వెంకట్, నరేష్ గౌడ్, మహేష్ చారి, ప్రవీణ్, మెతుకు కరుణాకర్, సాయికిరణ్, రాజేశ్వర్ చారి, మలిపెద్ది రమేష్, చందు, అఖిల్, కొనమైన అరుణ్, రొట్టెల రాహుల్, సుదర్శన్, సందీప్ కుమార్, హరిబాబు, నాని తదితరులు పాల్గొన్నారు.