6 August, 2026 | 2:47 AM

వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకండి

06-08-2026 12:20 AM

జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్

తెలకపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో గ్రామీణ ప్రజలకు ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్డీఎం చంద్రశేఖర్ పాల్గొని ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక భద్రత పథకాలు, సైబర్ అవగాహన అంశాలపై వివరించారు. వ్యక్తిగత ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు చేయడం, క్రమం తప్పకుండా పొదుపు అలవాటు చేసుకోవడం, బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలకు స్పందించకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పోషన్న, గ్రామస్థులు, మహిళలు, యువత పాల్గొన్నారు.