20 June, 2026 | 4:20 PM

Breaking News

ఇల్లందు–భూపాలపల్లికి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం   •   కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి   •   గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •  

ఆరు గ్యారెంటీల అమలు కోరుతూ బీజేపీ ధర్నా

17-03-2026 01:48 AM

భిక్కనూర్, మార్చి16 (విజయ క్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ నాయకత్వంలో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం తదితరాలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తిల్లి తిరుమలేష్, రంజిత్, నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.