ఇల్లందు–భూపాలపల్లికి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
20-06-2026 04:20 PM
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు ఆర్టీసీ డిపో నుంచి భూపాలపల్లికి కొత్తగా ప్రత్యేక బస్సు సర్వీస్‌తో పాటు నైట్ అవుట్ సర్వీసును ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ప్రారంభించారు. డిపో ఆవరణలో డిపో మేనేజర్ వేమూరి సుభాషిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ కిరణమిత్ర, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సర్వీసులు భూపాలపల్లి వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పిస్తాయని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.






