బీఆర్‌ఎస్‌తో బీజేపీ చీకటి ఒప్పందం
- హరీశ్‌రావు మతి తప్పి మాట్లాడుతున్నాడు
- ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి.. హరీశ్‌రావుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ చేశారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. హరీశ్‌రావు బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినా వాళ్లు పట్టించుకోలేదని, అందుకే మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు.
గురువారం రామచంద్రానాయక్ సీఎల్పీ కార్యాల యంలో మీడియాతో మాట్లాడుతూ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని అంటున్నారని, హరీశ్‌రావుకు చీము , నెత్తురు, దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలను ప్రజల ముందు పెట్టాలన్నారు. బీజేపీ తో బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానా లపైన కేసీఆర్, హరీశ్‌రావు ఎందుకు మాట్లాడటం లేదని రామచంద్రనాయక్ నిలదీశారు.






