ఆలయాల్లో ‘బీజేపీ’ పూజలు, అభిషేకాలు
కేసముద్రం, జూన్ 10 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాధినేతగా, సుదీర్ఘకాలం సేవాలందించిన కాంగ్రెసేతర ప్రధానిగా సరికొత్త చారిత్రాత్మక రికార్డును నెలకొల్పిన నేపథ్యాన్ని పురస్కరించుకుని బీజేపీ నేతలు కేసముద్రంలోని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రధాని మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ప్రజలకు, పెద్ద ఎత్తున మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, లెంకలపల్లి శ్రీనివాస్, వెలిశాల సవీన్, కొంకటి రవీందర్ రెడ్డి, గాంతి వెంకట్ రెడ్డి, బానోత్ రమేష్, జుజ్జురి వీరభద్ర చారి, భేతి వెంకన్న, భువనగిరి ఉపేందర్, మనిశెట్టి నాగయ్య, ముదిరెడ్డి మురళి, బానోత్ రాము, మల్యాల రాములు, జాటోత్ సురేష్, నునావత్ గణేష్ ప్రవీణ్, జంగిటి అనిల్, బొద్దుల ప్రశాంత్, సురేందర్, కంచు సురేందర్, భూక్య విజయ్ పాల్గొన్నారు.






