బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లోకి చేరిక
17-04-2026 03:55 PM
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఎనోలి గ్రామానికి చెందిన సుమారు 20 మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాంకిడి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో పార్టీలో చేరికయ్యారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, కార్యకర్తలపై చూపుతున్న ఆప్యాయత, అభిమానానికి ఆకర్షితులై తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.






