11 May, 2026 | 2:10 AM

మోడీ సభకు తరలివెళ్లిన నాగిరెడ్డిపేట బీజేపీ నాయకులు

11-05-2026 01:11 AM

నాగిరెడ్డిపేట్,మే 10 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.ముందుగా ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు గోపాల్పేట్ గ్రామంలో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి సుమారు 8000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలిపారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ సహకారం ద్వారానే జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీలకు వస్తున్నటువంటి నిధుల్లో 90% వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు తెలియజేయడం జరిగింది.

నాగిరెడ్డిపేట మండలం నుండి సుమారు 100 మంది కార్యకర్తలు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లినట్లు మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, మండల అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్, సీనియర్ నాయకులు హనుమాన్లు,బోయిని బాలయ్య,రాజిరెడ్డి,వెంకట్ రెడ్డి,భాస్కర్,గణేష్, విష్ణువర్ధన్, సాయిలు, రాజా, గంగాధర్, సత్యనారాయణ, గోపాల్,అనిల్ రెడ్డి,మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.