కాగితమేనని పడేశారో.. ఓటు పోద్ది..! : సర్' జాగ్రత్త
ఉట్నూర్,(విజయక్రాంతి): సర్ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ప్రస్తుతం వాస్తవంగా ఎంతమంది ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా వెళ్లడవుతుంది. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండడం.. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడం.. వలస వెళ్లిపోయిన వారి పేర్లు స్థానికులుగా జాబితాలో ఉండడం వంటివి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన సర్ తో ఎటువంటి లోపాలను అధికమించవచ్చు. ఓటర్లు తప్పకుండా తమకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే. లేకపోతే ఓటు హక్కు పోతుందని ఓటు హక్కు పోతుందని, తర్వాత ఓటు హక్కు పొందేందుకు అవస్థలు పడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాన్ని ఇంటింటికి ప్రతి ఓటర్లకు అందజేస్తున్నారు. బిఎల్ఓలు ఇచ్చే ఫారం లను సక్రమంగా భర్తీ చేసి బి ఎల్ వో లకు అందజేయవలసి ఉంటుంది.
ఫారం తిరిగి ఇవ్వకపోతే...
ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని గ్రామాల్లో బిఎల్ఓలు ప్రతి ఇంటికి తిరుగుతూ.. ఎన్నుమరేషన్ ఫారం అందచేస్తున్నారు. బిఎల్వోలు అందించిన ఫారం ను తిరిగి అందజేయకపోతే ఓటర్లు స్థానికంగా లేనట్లే భావిస్తారు. వారి వివరాలను ఆబ్సెంట్, షైటెడ్, డెడ్ జాబితాలో పెట్టిస్తారు. మళ్లీ ఓటు హక్కు పొందాలంటే తమ ఉనికి నిరూపించుకునేందుకు అవసరమైన ఫారాలను జత చేసి నిరీక్షించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానించిన ఫోన్ నెంబర్ కు విధిగా తెలియజేయవలసి ఉంటుంది. ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తారు.
ఇవి అప్పటి ఫోటోలతో సరిపోకపోతే చిత్రం అరేంజ్ రంగులకి మారిపోతుంది. అప్పుడు మళ్లీ ఫోటోను సరిచేసి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క మనిషికి సంబంధించిన వివరాలు సేకరించడం అప్లోడ్ చేయడానికి కనీసం అరగంటకు పైగానే సమయం పడుతుందని బి ఎల్ వో లు చెబుతున్నారు. సర్ తో ఓటర్లు జాగ్రత్తలు తెలుసుకొని బి ఎల్ ఓ లు ఇచ్చిన ఏన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా భర్తీ చేసి ప్రస్తుతమున్న ఫోటో జత చేసి బిఎల్ఓలకు అందజేయాలి.. లేనిపక్షంలో ఓటర్ల జాబితా నుండి పేరు పోతుందని ప్రచారం చేస్తున్నారు.






