26 June, 2026 | 5:31 PM

ఎస్ఐఆర్ సర్వేను ప్రారంభించిన చైర్ పర్సన్ దావస్వాతి

26-06-2026 04:13 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ సుభాష్ నగర్ బస్తి, 7వ వార్డ్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వేను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దావస్వాతి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ సర్వేను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. BLO లు ఇంటింటికి వెళ్లి సంబంధిత ఫారాలను పంపిణీ చేస్తారని, ఓటర్లు వాటిని పూర్తిగా నింపి సంబంధిత BLO లకు తిరిగి అందజేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన ఓటర్లు ఏ ఒక్కరి ఓటు కూడా మిస్ కాకుండా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ BLA లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వార్డ్ BLO, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.