26 June, 2026 | 5:05 PM

29న కోటమైసమ్మ ఆలయంలో వేలంపాట

26-06-2026 03:55 PM

కారేపల్లి,(విజయక్రాంతి): కారేపల్లి మండలం ఉసిరికాయల పల్లి కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఏడాది కాలపరిమితి తో టెంట్ సామాను కిరాయికి ఇచ్చుకోవడానికి, కొబ్బరి చిప్పల పోగు  చేసుకోవడానికి వేలం పాటను ఈనెల 29వ తారీఖున నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పట్టాభి రామారావు, ఈవో కే. వెంకటయ్య తెలిపారు. జూలై 1వతేది నుండి 31జూన్2027 కాలపరిమితితో కోట మైసమ్మ తల్లి ఆలయ పరిసరాలలో టెంట్ సామానుల నిర్వహణ, కొబ్బరి చిప్పల పోగు చేసుకోవడానికి ఈ వేలం పాట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. టెంట్ హౌస్ నిర్వాణ కోసం రూ.లక్ష, కొబ్బరి చిప్పల కోసం రూ.5000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్న వచ్చిన తెలిపారు. కొబ్బరి చిప్పల పోగుకు జాతర సమయంలో 20 రోజులు అవకాశం లేదన్నారు. ఆ సమయంలో వేరే టెండర్ అమలులో ఉంటుందని తెలిపారు.