4 May, 2026 | 4:29 AM

పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన బీజేపీ నేతలు

04-05-2026 03:06 AM

విచారణ లేకుండానే కేసులు నమోదు చేశారంటూ తీవ్ర నిరసన

నవాబుపేట, మే 3:మండల కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆందోళన తీవ్ర కలకలం రేపింది. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు.. బీజేపీ నిర్వహించిన పోలీస్ స్టేషన్ ముట్టడితో ఒక్కసారిగా వేడెక్కాయి.ఏకపక్ష కేసులపై భగ్గుమన్న కమలదళం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ పంచాయతీ పరిధిలోని తంగెళ్లపల్లిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై ఎస్త్స్ర విక్రమ్ అత్యుత్సాహం ప్రదర్శించారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.

సంఘటన స్థలానికి వెళ్లకుండా ఉన్నతాధికారుల పరిశీలన లేకుండా ఏకపక్షంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో నిరపరాధులను ఇరికించడమే కాకుండా ఎస్త్స్ర మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవ హరిస్తున్న ఎస్త్స్రపై వెంటనే వేటు వేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్రిక్తతకు దారితీసిన ముట్టడి:బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సి.లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పో లీస్ స్టేషన్ను చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సీఐ రంగప్రవేశం - హామీతో శాంతించిన ఆందోళనకారులు:ధర్నా తీవ్ర రూపం దాల్చడంతో మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నా రు. ఆయన ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. ‘తాను స్వయంగా సంఘటనా స్థలా న్ని పరిశీలిస్తానని. విచారణలో ఎస్త్స్ర తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఐ భరోసా ఇచ్చారు. కేసు నమోదులో లోపాలుంటే సరిదిద్ది, నిర్దోషులను కేసు నుండి తప్పిస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు ధర్నాను విరమించారు. సీఐ జోక్యంతో ప్రస్తుతానికి గొడవ సర్దుమణిగినా ఎస్త్స్రపై చర్యల అంశం మాత్రం స్థానికంగా రాజకీయ సెగలు రేపుతుంది.