23 March, 2026 | 3:21 PM

Breaking News

ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •  

సుల్తానాబాద్‌లో బీజేపీ నాయకుల అరెస్ట్

23-03-2026 11:43 AM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండల బీజేపీ నాయకుల ను  ముందస్తు అరెస్ట్ చేసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు, అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, కందునూరి కుమార్, ఎల్లేంకి రాజన్న, వేగోళం సదయ్య గౌడ్, తుమ్మ రాజ్ కుమార్, చిట్టావేన సదయ్య, ఎనగందుల సతీష్ తదితరులు ఉన్నారు.