జనసేనతో పొత్తు.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం
పవన్ సభ పెడతానంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని బీజేపీ చీఫ్ రామచందర్ రావు(BJP Chief Ramachander Rao) గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పేర్కొన్నారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ సభకు(Pawan Kalyan's Meeting) ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని సూచించారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు(Congress Party Alliance with CPM) ఎలా పెట్టుకుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరించారు. రాజకీయ పరిస్థితిని బట్టి తెలంగాణలో పొత్తులపై ముందుకెళ్తామని ఆయన ప్రకటించారు. జనసేనతో పొత్తుపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.






