22 March, 2026 | 4:02 AM

హామీల అమలుపై బీజేపీ పోరాటం

21-03-2026 12:41 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): కాం గ్రెస్ పార్టీ   ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమా ండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు..

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకులు రాష్ట్ర  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్, చిన్నారెడ్డి, విలాస్, రమేష్, సాగర్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.