22 April, 2026 | 11:03 AM

చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు

22-04-2026 09:25 AM

లండన్ మహా నగరంలో రిధా మీడియా బి. నాగ మహేష్, టి.నరేందర్ తమ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు  జన్మదిన వేడుక లండన్ లోని  బకింగ్ హామ్ షైర్ లో  జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, మంచి అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి పరిపాలనా దక్షతతో కేంద్ర ప్రభుత్వ అండ దండలతో ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని ఆనందాన్ని తెలియజేశారు. అశేష ప్రజాభిమానంతో చంద్రబాబు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు