పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ లో ఘనంగా జయంతి వేడుకలు
కరీంనగర్,ఆగస్టు 21(విజయక్రాంతి): ప్రజా ఉద్యమాల్లో టైగర్ నరేంద్ర చేసిన సేవలు ప్రజల కోసం సాగించిన పోరాటాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, కార్పొరేటర్ వాసాల రమేష్, అధ్యక్షులు మెతుకు సత్యం, పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం కరీంనగర్ లోని సంక్షేమ ట్రస్టులోని పద్మశాలి హాస్టల్ లో విద్యార్థులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఆలె నరేంద్ర 80వ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ తెలంగాణ హక్కులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆల నరేంద్ర చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
ప్రజల సమస్యలను నీదిగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధులు అని అన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన సిద్ధాంతాలు ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడని నాయకుడిగా పేరు సంపాదించాడని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమానికి తనవంతు కృషి చేశాడని వారు చూపిన బాటలో ఎందరో మార్గదర్శకంగా ముందుకు వెళుతున్నారని, కార్మికులకు సంఘ నేతగా దిక్సూచిగా నిలిచి చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర కోసం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే నరేంద్ర కోరిక హైదరాబాదులో జన్మించిన ఆలే నరేంద్ర మూడుసార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ప్రజా సమస్యలను జాతీయస్థాయిలో ప్రస్తావించారని అన్నారు.
పద్మశాలి సమాజానికే కాకుండా అన్ని వర్గాల హక్కుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. వారు చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం ఆలే నరేంద్ర ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అల్స భద్రయ్య, జిల్లా నాయకులు వోడ్నాల రవీందర్,మార్త ప్రకాష్, స్వర్గం నర్సయ్య, వంగర ఆంజనేయులు, రుద్ర పరమ్, మెతుకు వంశీకృష్ణ, జక్కని ప్రభాకర్, వేముల చంద్రశేఖర్, పాము రాజేశం, దేవసాని పాపయ్య, చిలుక నర్సప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి ఆలే నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.






