9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

కాంగ్రెస్‌లో బీర్కూర్ బీఆర్‌ఎస్ నేతల చేరిక

29-11-2025 12:00 AM

పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, నవంబర్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. బీర్కూర్ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు జోగు నర్సింలు, పందుల సుధాకర్, గుడి కొండ సాయిలు, కొండు పండరి, తుకారాం, కమ్మరి బాబు, దుర్గయ్య,  హన్మండ్లు, కొండ్రరాములు, పోతురాజు రాజు, నిరుడి రాజు, లస్మాపురం దశరథ్ బాన్సువాడలోని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సంధర్బంగా పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో  చేరడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. బీర్పూర్ మండలం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.