ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి
వీఎంఎస్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
సంగారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వాసవి మాత జ యంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సం గారెడ్డి పట్టణంలో వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, సం ఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా నిర్వహించడంతో జిల్లా కలెక్టర్‌లో జరిగిన జ యంతి వేడుకల్లో తహశీల్దార్ జైరాం నాయ క్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






