30 August, 2026 | 7:57 PM

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం

30-08-2026 06:48 PM

నిర్మల్, ఆగస్టు 30 ( విజయ క్రాంతి):  లక్ష్మణ చందా మండలంలోని వడ్యాల్ గ్రామంలో నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు చొరవతో వడ్యాల్ గ్రామంలో నూతనంగా సాంక్షన్ అయిన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజను నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమా రెడ్డి, లక్ష్మణ చందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి చేసి ప్రారంభించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని వారు భరోసా ఇచ్చారు. 

వడ్యాల్ గ్రామ సర్పంచ్ పసుపుల నరేష్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, పారుపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి గారు, వడ్యాల్ ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కప్పకంటి మోహన్, పోతారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.