ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి
పండుగలు ఐకమత్యానికి హేతువులు
జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్ నగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని, పండుగలు ఐక్యమత్యానికి హేతువులని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పాపయ్య నగర్ లో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య హాజరై అమ్మవార్లకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలపై ఉండి అమ్మవారి కరుణాకటాక్షాలతో జవహర్ నగరే కాక తెలంగాణ యావత్తు పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.
తెలంగాణలో అతిపెద్ద పండుగ బోనాల పండగేనని ఈ పండుగ ఐక్యమత్యానికి చిహ్నాలు అన్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు మేకల భార్గవ రామ్, పాపయ్య నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






