29 August, 2026 | 1:49 PM

మృతుల కుటుంబాలకు పరామర్శ

29-08-2026 01:06 PM

ఆమనగల్లు, అగస్టు 29(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం ​వెల్దండ మండలంలోని వెల్దండ, చేర్కూర్, పెద్దాపూర్ గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను శనివారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.​

ఈ సందర్భంగా పెద్దాపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మ కుటుంబానికి రూ.5,000, వెల్దండ గ్రామానికి చెందిన పుట్ట శ్రీశైలం కుటుంబానికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.  కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పుట్టారామిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, చేర్కూర్ సర్పంచ్ శ్రీనివాసులు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.