30 April, 2026 | 1:37 AM

పది ఫలితాల్లో భగవతి, ఆర్విన్ ట్రీ విజయకేతనం

30-04-2026 12:28 AM

అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): నేడు వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ.వైష్ణవి 581 మార్కులతో, వి.పర్ణిక లు 579 మార్కులతో విజయ దుందుభి మోగించారు.మొత్తం 53 మంది విద్యార్థులకు గాను 39 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారని పాఠశాలల చైర్మన్ బి. రమణరావు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బి. రమణరావు, డైరెక్టర్ బి . విజయలక్ష్మి విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అనంత రం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కళాశాల జీవితంలో కూడా మరెన్నో విజయాలను పొందుతూ తమ లక్ష్యాన్ని చేరుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ప్రతాప్ సి. రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్స్ రామ్ మోహన్ రావు, జాయిస్ విద్యార్థులకు , ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.