5 April, 2026 | 4:10 AM

డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాం

05-04-2026 12:12 AM

ముషీరాబాద్,ఏప్రిల్ 4(విజయక్రాంతి): డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ సమీపంలోని భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్మెంట్ వాసులు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.

ఆర్టిసి క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ నిర్మాణం కాకముందు నుండి సుమారు గత 25 సంవత్సరాలుగా ఏ నాయకులు పట్టించుకొని వీధిని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన అభివృద్ధి చర్యల్లో భాగంగా నూతన సిసి రోడ్డు నిర్మాణం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు.

We have worked very hard for the development of the divisionఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ సన్మానించామని భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. సన్మానించిన అపార్ట్మెంట్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ నేతలు ఎం. ఉమేష్, సాయి కుమార్, నీరజ్, జ్ఞానేశ్వర్, సాయి తరుణ్, భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.