6 June, 2026 | 3:04 AM

పేటకు ‘ఉత్తమ పర్యావరణ’ పురస్కారం

06-06-2026 12:00 AM

మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌కు అవార్డు అందజేత

సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం గా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రదానం చేసే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారానికి సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికైంది. ఈ అవార్డును శుక్రవారం హైదరాబాద్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, కమిషనర్ హన్మంత రెడ్డిలు అందుకున్నారు.

పట్టణంలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో సూర్యాపేట మున్సిపాలిటీ ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ ఈ పురస్కారం పట్టణ ప్రజలు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి ఫలితంగానే సాధ్యమైంది అన్నారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి సూర్యాపేటను రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.