10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఉగ్రవాదులకు బెంగాల్ ప్రభుత్వ సహకారం

31-12-2025 01:18 AM
  1. ఓట్ల కోసమే చొరబాట్లకు సీఎం మమత ప్రోత్సాహం
  2. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు

కోల్‌కతా, డిసెంబర్ ౩౦: ఓట్ల కోసం బెంగాల్ ప్రభుత్వం బంగ్లా నుంచి చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, తద్వారా సీఎం మమతా బెనర్జీ ఉగ్రవాదానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కేంద్ర హోమంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్రమ చొరబాట్లు జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామని ప్రతినబూనారు. చొరబాటుదారులను వెతికి మరీ ఏరివేస్తామని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రక్షణ కంచె ఏర్పాటుకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని, కనీసం భూమి ఇవ్వమని అడిగితే ఆ పని కూడా చేయడం లేదని ఆరోపించారు.

15 ఏళ్ల తృణమూల్ పాలనలో అవినీతి, భయం, అరాచకం పెచ్చుమీరాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదల సంక్షేమ పథకాలను బెంగాల్ టోల్ సిండికేట్లు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.