21 April, 2026 | 3:59 AM

బెల్లంకొండ గణేశ్ రొమాంటిక్ కామెడీ

21-04-2026 02:31 AM

తొలి ప్రేమ, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఏ కరుణాకరన్, యంగ్ హీరో బెల్లంకొండ గణేశ్‌తో కలిసి ఒక న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నారు. దీన్ని గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మిస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయికలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు దర్శకుడు అనుదీప్ కేవీ డైలాగ్ రైటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా పనిచేస్తుండటం విశేషం. ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తొలి క్లాప్ ఇవ్వగా, అనుదీప్ కెవీ స్క్రిప్ట్ అందించి కెమెరా ఆన్ చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.