16 May, 2026 | 4:13 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

17-02-2026 12:39 AM

నాగోల్ సీఐ జానీ

ఎల్బీనగర్, ఫిబ్రవరి 16: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలిగినప్పుడే ఆర్థిక మోసాలకు గురికాకుండా తమ కష్టార్జిత ధనా న్ని కాపాడుకోగలుగుతారని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు. సోమవారం నాగోలు పరిధిలోని బం డ్లగూడలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై బుర్ర కథ కళాకారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మక్బూల్ జానీ మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ మోసాల పద్ధతులు కూడా విస్తరిస్తున్నాయని సోషల్ మీడియా మోసాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంకు అధికారులు  ఖాతాదారులకు ఆర్థిక సాక్షరతపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజలక్ష్మి, సిబ్బంది మమత, శశిధర్ , ఫణి కుమార్, ఖాతాదారులు పాల్గొన్నారు.